కోవెలకుంట్లలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ నెల 26న మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరికట్ల మల్లికార్డునరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీర్ణకాలంగా పెండింగ్లో ఉండి రాజీ కాదలచుకుంటే అన్ని సివిల్, క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కోవెలకుంట్ల, సంజావుల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, రేవనూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.