శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చందిన అల్లక కేదారేశ్వరరావు. ఈయన 1994లో డీఎస్సీని తృటిలో కోల్పోయారు.. 1996లో సెలెక్ట్ అయినా కొన్నికారణాల వల్ల అవకాశం రాలేదు. ఆ తర్వాత కష్టపడి చదివి 1998లో డీఎస్సీకి క్వాలిఫై అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఏడాది డీఎస్సీ వివాదంలో పడింది. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదవు, వాగ్దాటి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా.. ఆయన మాత్రం నిరాశలోకి వెళ్లిపోయారు.
చదువంటే ఎంతో ఆసక్తితో విద్యనభ్యసించి టీచర్ కావాలనే తపనతో ముందుకు సాగిన వ్యక్తి అల్లక కేదారేశ్వర రావు. పాతపట్నం మండలం సీది గ్రామం ఈయనది. గ్రామంలో ఓ సాధారణ చేనేత కార్మిక కుటుంబంలో ఆయన జన్మించాడు 1994 డిఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. తిరిగి 1998 డీఎస్సీలో ఉద్యోగం సంపాదించాడు. అప్పటి ప్రభుత్వ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని వివాదాలు చోటుచేసుకోవడంతో కేదారేశ్వరరావుకు కొలువు నిలిచిపోయింది.
ఉద్యోగం సంపాదించే లేదనే బాధతో మానసికంగా ఇబ్బందులకు గురై కుటుంబానికి సైతం దూరమయ్యాడు. కొద్ది రోజులు సైకిల్ పై చేనేత వస్త్రాలు వీధుల వెంబడి తిరిగి విక్రయాలు జరిపినా కలిసిరాక వ్యాపారాన్ని సైతం విడిచిపెట్టి, బిక్షాటన చేసుకున్నాడు. తల్లిదండ్రులు సహోదరులు విడిచిపెట్టి వేశారు. ప్రస్తుతం కూడా ఆయన భిక్షాటన చేస్తూనే జీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే 1998కి సంబంధించి కోర్టు కేసులో ఉన్న వ్యతిరేక పరిస్థితులను వీడి ఉద్యోగం పొందిన వారి అప్పటి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. అందులో కేదారేశ్వర రావు ఉన్నారు. 23 ఏళ్లు గడిచాయి అని ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు అని ఆయన చెప్పుకొచ్చారు. కొలువు దక్కినా ఆఖరి సమయంలో రావడంతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ ఆయన ఎన్నో ఏళ్ల కల నెరవేరే నెరవేరిందని సంతోషిస్తున్నట్లు తెలిపారు.