వీఐపీలు ఏ వస్తువు పోగొట్టుకొన్నా అది వార్తే. వారు ఫిర్యాదు చేస్తే చర్యలు కూడా వెనువెంటనే చేపడతారు. తాజాగా తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పెన్ను విలువ అక్షరాలా లక్షా యాభైవేల రూపాయలని, అది తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చిన కలమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా గిండీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్వాగతం పలికిన సమయంలో ఆ పెన్నును ఎవరో దొంగిలించారని పేర్కొన్నారు. ఆ పెన్నును తన తండ్రి తనకు బహుమతిగా ఇచ్చారని, కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa