రేపల్లె: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు, సిపిఐ కార్యదర్శి నాగాంజనేయులు హెచ్చరించారు.
మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపిచ్చిన సమ్మెలో భాగంగా.. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు.