రండి..బ్రహ్మచారుల ఉద్యమంలో చేరండి అని ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనమంతా వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. "జనాభా పెరుగుదలపైనా, సంతానం కలిగి ఉండడంపైనా ప్రచారంలో ఉన్న విధానాలపై ఆలోచిద్దాం... లేకపోతే నాలాగా ఏకో నారాయణలా ఉండండి అందరం కలిసి సుస్థిర భవిష్యత్తు దిశగా పాటుపడదాం రండి, బ్రహ్మచారుల ఉద్యమంలో చేరండి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. టెమ్జెన్ ఇమ్నా నాగాలండ్ క్యాబినెట్ లో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాగాలాండ్ బీజేపీకి ఆయనే అధ్యక్షుడు. ఎప్పుడూ సరదాగా ఉంటారని ఆయనకు పేరుంది.