ప్యాపిలి: జనాభా రోజురోజుకు పెరుగుతున్న నేప థ్యంలో కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని వైద్యాధికారిణి వాణిశ్రీ కోరారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ కుటుంబ నియంత్రణకు పురుషులు వేసెక్టమీ, స్త్రీలు ట్యూబె క్షమి పద్ధతులను అవలంభించాలని చెప్పారు. కాన్పు కాన్పుకు మధ్య మూడేళ్లు ఎడం పాటించాలని సూచించారు. వైద్య సిబ్బంది ఉన్నారు.