ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ కొరలు విప్పుతున్న పోలియో...తాజాగా న్యాయార్క్ లో వెలుగులోకి

international |  Suryaa Desk  | Published : Sun, Jul 24, 2022, 04:01 PM

పోలియో కంటే పోలియో చుక్కలంటే అందరికీ తెలుసు. పోలియో వ్యాధి భారిన పడుతున్నవారు మనకు ప్రస్తుతం కనిపించడం చాలా అరుదు. కానీ అంతరించి పోయిందనుకుంటున్న పోలియో మహమ్మారి కేసులు మళ్లీ అడపాదడపా బయటపడుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 కేసులు వెలుగుచూశాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కేసు బయటపడింది. అక్కడ ఓ వ్యక్తిలో పోలియోను గుర్తించినట్టు వైద్యాధికారులు తెలిపారు. పోలియో చుక్కల టీకాలో ఉండే బలహీన వైరస్ నుంచి అతడికి పోలియో సోకినట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. 


పోలియో నివారణకు వేసే చుక్కల మందు టీకాను 2000వ సంవత్సరంలోనే అమెరికా నిలిపివేసింది. ప్రస్తుతం ఇంజెక్షన్ ద్వారా టీకాలు వేస్తున్నారు. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకాలో మృత వైరస్ ఉంటుంది. అదే చుక్కల టీకాలో అత్యంత బలహీనమైన పోలియో వైరస్ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. బలహీన వైరస్‌ను పంపడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పోలియో వైరస్‌ను గుర్తుపడుతుంది. భవిష్యత్తులో శక్తిమంతమైన వైరస్ వచ్చినప్పుడు దానితో పోరాడుతుంది. అయితే, తాజాగా వెలుగు చూసిన కేసులో బాధితుడు పోలియో బారినపడడానికి ఈ బలహీన వైరస్సే కారణమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com