మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని న్యూ లైఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో జరిగిన ఘోర ప్రమాదం తరువాత మరణించిన వారి సంఖ్యను అధికారులు ధృవీకరించారు. ఈ అగ్నిప్రమాదంలో రోగులతో సహా కనీసం 10 మంది మరణించారు.మంటలు చెలరేగినప్పుడు, రోగులు మరియు ఆసుపత్రి సిబ్బందితో సహా చాలా మంది భవనం లోపల ఉన్నారు. పలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మధ్యప్రదేశ్ వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. అయితే షార్ట్‌సర్క్యూటే కారణమని ఆయన సూచించారు.