కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై వైసీపీ కౌన్సిలర్లు లేవనెత్తిన్న అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.
వ్యాజ్యానికి అర్హత ఉందని తేల్చి చెప్పిం ది. ప్రధాన వ్యాజ్యం పై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎంపీ కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థా నం ఆదేశాలతో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. పిటిషన్‌కు విచారణార్హత లేదని, ఆ విషయంలో నిర్ణయం వెల్లడించిన తరువాతే ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరపాలని వైసీ పీ కౌన్సిలర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వ్యాజ్యం విచారణార్హతపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఎంపీ కేశినేని నాని వేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందని తేలుస్తూ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, చైర్మన్ ఎన్నిక ఫలితాల ప్రకటన ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.