లింగాల మండలం అక్కులుగారి పల్లి గ్రామంలో జగనన్న కాలనీ గృహ నిర్మాణాల కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాబుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ఇంటి నిర్మాణము వివిధ దశలలో ఉన్న వారికి ఆన్లైన్ లో బిల్లు లు నమోదు చేయాలన్నారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా మంజూరు చేశారని గుర్తు చేశారు. గృహనిర్మాణం లబ్ధిదారులు త్వరిత గతిన గృహ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఇల్లు లేని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదరిక నిర్మూలనలో గృహ వసతి కలిగి ఉండడం ఒక సామాజిక అవసరం, ప్రతి పేద కుటుంబం ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ జయపాల్ గ్రూప్ ల లోని సభ్యులకు గ్రామ సమాఖ్య అసిస్టెంట్ హెూసింగ్ లోన్స్ 35000 తక్షణమే ప్రణాళిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాబు గ్రామ సమాఖ్య అసిస్టెంట్ సరస్వతి గృహ నిర్మాణ లబ్ధిదారులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.