టర్కీలోని ఓ ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తుంది. ఒక తేలులో 2 నుంచి 3 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. నాలుగు వందల తేళ్ల నుంచి ఒక గ్రాము విషం సేకరిస్తారు. తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్‌కిల్లర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేకమైన పద్దతిలో విషాన్ని సేకరిస్తారు. తేళ్లకు హాని జరగదు. కొంత మంది తేళ్లను పెంచడం విశేషం. లీటర్ తేలు విషం రూ.80 కోట్లు పలకడం గమనార్హం.