సోమందేపల్లి: మండల కేంద్రంలోని సాయినగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సోము కూతురు చాందిని(6) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. శరీరంలో రక్తం చెడిపోయి జ్వరం తలకు ఏక్కడంతో చాందిని అచేతనంగా పడిపోయింది. దీంతో కిడ్నీలు ఇన్ ఫెక్షన్ అయ్యాయి. దిక్కుతోచని స్థితిలో సోము బిడ్డను బ్రతికించుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు.