అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్. ఈ సినిమాలో కథానాయికగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది సాయేషా సైగల్. రెండో సినిమాతోనే బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్టార్ హీరో అజయ్ దేవగణ్ చిత్రం శివాయ్ లో నటించింది. ఈ మూవీ హిట్ కావడంతో హిందీ, తమిళ భాషలలో సాయేషాకి పలు ఆఫర్స్ వస్తున్నాయి. యాక్టింగ్‌తో పాటు డ్యాన్సింగ్ టాలెంట్ ఉన్న సాయేషా తాజాగా తన అఫీషియల్ పేజ్‌లో డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసి సాయేషాలో ఇంత ప్రతిభ దాగుందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ అమెరికన్ అయిన హాలీవుడ్ పాప్ సింగర్ విద్యా వోక్స్ రీమిక్స్ చేసిన ఓపాటకు అద్భుతమైన స్టెప్పులతో అలరించేసింది సాయేషా సైగల్. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa