బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూతురు నిషా కౌర్ వెబర్ (10) చిన్న వయసులోనే ఆవిష్కర్తగా గుర్తింపు పొందింది. ‘బూ బాక్స్’ అనే టూ-ఇన్-వన్ టిష్యూ హోల్డర్‌ను రూపొందించి పేటెంట్ సాధించింది. ఈ టిష్యూ బాక్స్‌కు చిన్న చెత్తబుట్టను జతచేసింది. దీంతో టిష్యూ వాడుకున్న వెంటనే పక్కనే ఉన్న బిన్‌లో పడేయవచ్చు. దీనివల్ల ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ముంబైలో దుమ్ము కారణంగా అలర్జీ రావడంతో తనకి ఈ ఆలోచన వచ్చిందని సన్నీ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa