ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మీకు మాత్రమే చెప్తా’ కి యూ/ఏ సర్టిఫికెట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 06:17 PM

దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా రాబోతున్న చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సన్నధం అవుతుంది. మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ సినిమా చేస్తున్నాడట. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమఠం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి దేవరకొండ మొదటి వెంచర్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa