సుభాష్‌చంద్రబోస్, గోపాలగోపాల చిత్రాల్లో వెంకటేష్‌తో జోడీకట్టింది శ్రియ. ఈ సినిమాల్లో వారిద్దరూ తమ కెమిస్ట్రీతో ఆకుట్టుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీరి కలయిక వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం అసురన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెలుగులో రీమేక్ కానున్నది. ఇందులో వెంకటేష్ భార్య పాత్రలో శ్రియ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ, తన పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో శ్రియ ఈ రీమేక్‌లో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా వెంకటేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa