దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ ` లక్ష్మి రాయ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం `సిండ్రెల్లా`. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని మల్టీ కలర్ ఫ్రేమ్స్, ఎస్.ఎస్.ఐ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై తెలుగులో మంచాల రవికిరణ్ `సిండ్రెల్లా` పేరుతోనే ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎస్.జె.సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. హారర్ ఫాంటసీ, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రానుంది. సర్కార్ 3, కిల్లింగ్ వీరప్పన్ చిత్రాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన రమ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa