విక్రమ్ సేథ్ రాసిన 'ఎ సూటబుల్ బాయ్' నవల ఆధారంగా మీరా నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ టబు 24 యేళ్ల కుర్రాడితో రొమాన్స్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో టబు వేశ్య పాత్రలో కనిపించబోటున్నారు. 24 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖత్తర్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో టబు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో టబు ఉయ్యాలపై వయ్యారంగా కూర్చుని ఉంటే పక్కన ఇషాన్ బోర్లపడుకుని ఆమె అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. సినిమాను ఓ మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్నారు కాబట్టి టబు, ఇషాన్ ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జెడ్ స్పీడుతో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం టబు తెలుగులో 'అల వైకుంఠపురంలో' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa