ఇప్పుడు రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై జయలలిత మేనకోడలు దీప అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు దీప పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో జయలలిత బయోపిక్స్ నిర్మిస్తోన్న దర్శక నిర్మాతలకు ఊరట లభించింది. జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనారనౌత్ `తలైవి` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే నిత్యామీనన్‌తో ప్రియదర్శిని `ఐరన్ లేడి` అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో గౌతమ్ మీనన్, మురుగేశన్ దర్శకత్వంలో క్వీన్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa