ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమృతరామమ్‌' ట్రైలర్‌ రీలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 01:23 PM

ప్రేమలోతును, అందులో మునిగినవారి పరిస్థితిని చెప్పడానికి 'అమృతరామమ్‌' సినిమా సిద్ధమైంది. 'దేర్‌ ఈజ్‌ నో లవ్‌ విత్‌ అవుట్‌ పెయిన్‌' అనే క్యాప్షన్‌తో సినిమా ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో మూలన మిగిలి ఉన్న ప్రేమను తట్టిలేపేందుకు ఈ ప్రేమకావ్యం త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. హీరో హీరోయన్లు రామ్‌ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమలో ఉండే అన్ని కోణాలను స్పృశించేందుకు ప్రయత్నించిందీ చిత్రం. కాకపోతే ఈ సారి ప్రేమకోసం పరితపించింది, ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది ప్రేమికుడు కాదు, ప్రేయసి. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత. 'తన ప్రేమని నువ్వు గెలవాలంటే ముందు నువ్వు ఓడిపోవాలి', 'ప్రేమలో సంతోషాలే కాదు, త్యాగాలు కూడా ఓ భాగమే' 'రోజురోజుకీ నాకు డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, నేను నీకు అడిక్ట్‌ అవుతున్నాను' వంటి డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ప్రేమగీతాలు సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. ఈ చిన్న సినిమా సురేష్‌బాబు లాంటి పెద్ద నిర్మాతను ఆకట్టుకుంది. ఈ సినిమాకు దర్శకుడు: సురేందర్‌ కొంటడ్డి. నిర్మాత: ఎస్‌ఎన్‌ రెడ్డి. సంగీత దర్శకుడు: ఎన్‌ఎస్‌ ప్రసు. గేయరచయిత: చైతన్యప్రసాద్‌, మధుసూదన్‌ రామదుర్గం, కృష్ణ చైతన్య.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa