సన్నీలియోన్ ప్రధాన పాత్ర లో సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట సన్నీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లని ఇచ్చినట్లు సమాచారం.
అయితే చిత్ర యూనిట్ సన్నీ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్నీతో సెల్ఫీ దిగాలి అంటే చిత్ర టైటిల్ గెస్ చేసి ప్రొడక్షన్ సంస్థ @steevescorner ని ట్యాగ్ చేస్తూ #SunnyLeoneInSouth, #SunnyLeoneInTamil అని ట్విట్టర్ లో సినిమా టైటిల్ ని పోస్ట్ చేయాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ టైటిల్ “EVI” తో ఎండ్ అవుతుందని కూడా వారు ఓ హింట్ ఇచ్చారు. కరెక్ట్ టైటిల్ గెస్ చేసి కంటెస్ట్ లో గెలుపొందిన వారు చిత్ర పూజా కార్యక్రమం సమయంలో సన్నీతో సెల్ఫీ దిగే ఛాన్స్ కొట్టేయోచ్చట. మరి అభిమానులు టైటిల్ గెస్ చేయండి.. సన్నీతో సెల్ఫీ దిగండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa