నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. 'వాటే బ్యూటీ' అనే పాట ప్రోమోను ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇతర ముఖ్యపాత్రలను అనంత్ నాగ్ .. వెన్నెల కిషోర్ .. నరేశ్ .. రాజీవ్ కనకాల పోషించారు. వచ్చేనెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా నితిన్ సక్సెస్ లకు దూరంగా వున్నాడు. రష్మిక గోల్డెన్ లెగ్ వలన ఈ సినిమాతో ఆయనకి హిట్ పడుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa