బ్లాక్ బస్టర్ మూవీస్ ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ 106వ సినిమాగా తెరకెక్కతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఇక ఈ సినిమాను మిర్యాలగూడ రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రూలర్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ ఈ మూవీకి కూడా పనిచేస్తున్నారు.
అయితే రూలర్ సినిమా తరువాత బాలయ్య, రామ్ ప్రసాద్ మధ్య కొన్ని విబేధాలు వచ్చాయట. ఈ సినిమాలో తనను సరిగా చూపించలేదని బాలయ్య, రామ్ ప్రసాద్‌పై విమర్శలు చేశారట. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాట మాట కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో హర్ట్ అయిన రామ్ ప్రసాద్ మొదట బోయపాటి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇదిలా ఉంటే మరోవైపు బోయపాటి ఈ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ తీసుకుందాం అనుకుంటే.. నిర్మాత బడ్జెట్ ఆంక్షలతో ఏమీ చేయలేకపోయారట. ఈ క్రమంలో బాలయ్య, రామ్ ప్రసాద్‌లను బోయపాటి కాంప్రమైజ్ చేశారట. ఇక కాంప్రమైజ్ అయ్యేందుకు బాలకృష్ణ మొదట ఒప్పుకోనప్పటికీ.. దర్శకుడి బలవంతంతో కాస్త వెనక్కి తగ్గారట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మంచి సయోధ్యనే కుదిరినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa