ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ 'యే హై మొహబతేన్' నటి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ ఏలియన్ చేసినట్లుగా ఆమె డాన్సు చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా వీక్షించారు. 'యే హై మొహబతేన్' షూటింగ్ కోసం లండన్ వెళ్లిన సందర్భంగా ఆమె ఈ పోస్టు చేసింది. 'ఈ ఏలియన్‌తో కలిసి డాన్స్ చేసేంత వరకు ఇది నన్ను విడిచిపెట్టలేదు' అంటూ ఆమె సరదాగా ఈ వీడియోకి సంబంధించి ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa