ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాస్ట్రో' నుంచి ప్రమోషనల్ ప్రోమో సాంగ్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 09:51 PM

నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో' రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'మాస్ట్రో .. మాస్ట్రో .. 'అంటూ ఈ సాంగ్ సాగుతోంది.


మహతి స్వరసాగర్ బీట్ బాగుంది.  శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రేవంత్ ఆలపించాడు. పూర్తి వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఆ మధ్య హిందీలో విజయాన్ని సాధించిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. నభా నటేశ్ కథానాయికగా అలరించనుంది.తమన్నా ఒక కీలకమైన పాత్రలో నటించగా, జిషూ సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో శ్రీముఖి మెరవనుంది. ఈ ఏడాదిలో ఇది నితిన్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. హిందీలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa