పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్”. వచ్చే ఏడాది సంక్రాంతి రేసుకు రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన సాలిడ్ అప్ డేట్స్ ను చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం చిత్రంలోని నాల్గవ పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ ధృవీకరించారు. ఇక ఇప్పుడు ఈ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ అప్‌డేట్‌లో “ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్” అనే నాల్గవ పాటను రేపు ఉదయం 10 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నట్లు ధృవీకరించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa