ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“బంగార్రాజు” నుంచి 'నాకోసం' లిరికల్ టీజర్ రీలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 01:16 PM

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్. ఈ సంక్రాంతి బరిలో బంగార్రాజు నిలిచారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతోంది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు మరియు పాటలు ప్రేక్షకులను మరియు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని నాకోసం అనే పాట లిరికల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. పూర్తి పాటను డిసెంబర్ 5 సాయంత్రం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa