ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాప్ 100 ట్రెండింగ్ లో ఆల్ "పుష్ప” సాంగ్స్..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 04, 2022, 02:20 PM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని 5 పాటలు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లిస్ట్‌లో ఉన్నాయి. మొదటి స్థానంలో ఊ అంటావా, ఊ అంటావా సాంగ్, రెండో స్థానంలో సామి సామి పాట, 24వ స్థానంలో శ్రీవల్లి పాట, 74వ స్థానంలో డకో డకో మేక పాట, 97వ స్థానంలో ఏ బిడ్డా నా అడ్డా పాట. ఇలా ఐదు పాటలు టాప్ 100 ట్రెండింగ్ లో నిలవడం ఓ రికార్డు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa