సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ ప్రొమోషన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తారక్‌ని తన స్మార్ట్‌ఫోన్‌లో ఏ పాట ఎక్కువగా ప్లే చేస్తాడో చెప్పమని అడగగా,వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన 'కేర్ ఆఫ్ కంచరపాలెం'లోని ‘ఆశ పాశం’ సాంగ్ ప్లే అవుతుంది అని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa