ఎస్ఎస్ రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌తో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించాడు. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కలయికలో మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమా మొదటి రోజే రూ.257 కోట్ల వసూళ్లను సాధించింది. తొలి మూడు రోజుల్లో మొత్తం రూ.500 కోట్లపైనే రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ సరసన సీతగా అలియా భట్ నటించగా, ఎన్టీఆర్‌ను ప్రేమించిన యువతిగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించింది. అయితే ఒలివియా పాత్రను కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్లె కైఫ్‌కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఆమె సినిమాలో భాగం కావడానికి నిరాకరించింది. తాజాగా ఈ అంశంపై ఆమె సన్నిహితుల వద్ద పశ్చాత్తాపం పడినట్లు చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆమె స్టాన్లీ డికోస్టా దర్శకత్వం వహించిన 'టైమ్ టు డ్యాన్స్' అనే డ్యాన్స్ ఫిల్మ్‌లో సూరజ్ పంచోలీతో కలిసి నటిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ.