ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా: మెగాస్టార్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 12:07 PM

తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది.బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా చూశానని, చాలా బాగుందని మెచ్చుకున్నారు. చిన్నతనంలో ఓ  బాలనటుడి నటించడం చూసి మోజుపడి సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. పింక్, బద్లా వంటి చిత్రాల్లో తాప్సీ బాగా నటించింది. ఝుమ్మందినాదం అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తాప్సీ, ఆ సమయంలో తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానన్నారు. తనతో నటించే అవకాశాన్ని పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల జారవిడుచుకున్నానని, ఆ విషయంలో బాధగా ఉందని అన్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఇంప్రెస్ అయిన దర్శకుడు స్వరూప్ కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. తెలుగు సినిమాల్లో వస్తున్న వైవిధ్యం, మంచి కథలు మన సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాయన్నారు. ఆ విషయంలో దర్శకధీరుడు రాజమౌళిని మెచ్చుకోవాలి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa