ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప 2' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 04:49 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 2021 లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ 'పుష్ప 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్ సుకుమార్‌కు దాదాపు 45 కోట్లు ఇస్తున్నట్లుగా, హిందీ రైట్స్ కి వచ్చిన మొత్తం అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్‌ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సమంత కూడా ఈ సీక్వెల్‌లో నటించే అవకాశం ఉంది అని టాక్.
'పుష్ప' సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో తన అభిమానులను అండ్ ప్రేక్షకులను మరోసారి అలరించడానికి  రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని మేకర్స్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa