టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 12, 2022న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకి ముందు ట్రైలర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగా ఈ సినిమాకి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడారు. ఈ చిత్రంలోని మొత్తం 5 పాటలను తానే రాశానని, ఒక మాస్ సాంగ్ మరియు మరో మెలోడీ ట్రాక్ ఇంకా విడుదల కావాల్సి ఉందని, రెండూ ఖచ్చితంగా చార్ట్ బస్టర్ గా నిలుస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మెలోడీ పాటకు 'మురారి వా' అనే టైటిల్ కూడా పెట్టినట్లు ఆయన తెలిపారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa