లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఒక యాక్షన్ సినిమా చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఎటాక్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఏప్రిల్ 1, 2022న థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా త్వరలో డిజిటల్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం మే 27, 2022న OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా OTT ప్లాట్‌ఫారమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa