యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇటీవలే ఎన్టీఆర్ 30 సినిమా ప్రకటన జరిగిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ తో సినిమాపై అంచనాలను క్రియేట్ చెయ్యటంలో కొరటాల గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలచడానికి కావలసిన అన్ని విషయాలపై కొరటాల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకోసం తన టెక్నికల్ టీం లో భారీ మార్పులు చేసిన కొరటాల ఈ సినిమాలో తారక్ సరసన నటించబోయే హీరోయిన్ పై మరింత శ్రద్ద తీసుకున్నాడట.
ఎన్టీఆర్ 30పై మరింత బజ్ ను తీసుకురావటానికి బాలీవుడ్ హీరోయిన్ ను తారక్ సరసన నటింపచేయాలని ముందుగా అనుకున్న కొరటాల తాజాగా మనసు మార్చుకుని, మిస్ ఇండియా 2022 కిరీటం గెలుచుకున్న కన్నడ బ్యూటీ సీని శెట్టిని ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో పడ్డారంట. ఈ విషయమై తారక్, కొరటాల మధ్య పెద్ద డిస్కషన్ కూడా జరిగిందట. కానీ, మిస్ ఇండియా గా గెలుపొందిన వారు ఒక సంవత్సరం పాటు ఎలాంటి సినిమాలకు సైన్ చెయ్యకూడదనే నిబంధన ఉందని తెలిసి ఆ ఆలోచనను కొరటాల విరమించుకున్నారట. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని రాత్రికి రాత్రి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న 21ఏళ్ళ సీని శెట్టిని ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా నటింపజేసి, నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేద్దామనుకున్న కొరటాల ఆశలు అడియాసలే అయ్యాయి.