ప్రముఖ గాయని శ్రావణ భార్గవి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఆమె ఇటీవల తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల శృంగార సంకీర్తన పట్ల చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
భక్తితో పాడాల్సిన ఆ కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల మండిపడ్డారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.