ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సిటాడెల్":బ్యాంకాక్లో సమంత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 05:07 PM

సౌత్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత "ది ఫ్యామిలీ మాన్" వెబ్ సిరీస్ తో ఒకేసారి ఓటిటి డిబట్, బాలీవుడ్ డిబట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే ద్వయం డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ వెబ్ సిరీస్ తో ఉత్తరాదిన సమంత ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
ఇటీవలే సమంత మరొక వెబ్ సిరీస్ "సిటాడెల్" ను ప్రకటించింది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసే ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. అమెరికన్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ లో తన పాత్రకు తగ్గట్టు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించేందుకు తన బాడీని సన్నద్ధం చేసుకునేందుకు సమంత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోర్స్ చేయనుందట. ఈ కోర్స్ కోసం త్వరలోనే బ్యాంకాక్ కు వెళ్లబోతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa