హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం "సీతారామం". వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దీంతో సీతారామం థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సీతారామం బిజినెస్ ఎలా ఉందంటే, నైజాం - 5కోట్లు, సీడెడ్ - 2 కోట్లు, ఆంధ్ర - 7కోట్లు.. మొత్తం కలిపి ఏపీ, తెలంగాణాలలో 14కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. అలానే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - డెబ్బై లక్షలు, ఓవర్సీస్ - రెండున్నర కోట్లు, మిగిలిన భాషల్లో కోటిన్నర.. ప్రపంచవ్యాప్తంగా 18. 70కోట్ల బిజినెస్ ను జరుపుకుని, 19. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆగస్టు 5న విడుదల కాబోతుంది.