మెగా ప్రిన్స్ ఈ ఏడాది సోలో హీరోగా "గని" సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ మల్టీస్టారర్లుగా నటించిన ఎఫ్ 3 మూవీ సూపర్ హిట్ అయింది. ఆపై నుండి వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
వరుణ్ తన నెక్స్ట్ ను psv గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తో ఫిక్స్ చేసుకున్నాడు. ఐతే, ప్రస్తుతానికి ఈ మూవీని మేకర్స్ హోల్డ్ లో పెట్టారని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే, ప్రవీణ్ సత్తారు నాగ్ తో తెరకెక్కిస్తున్న ది ఘోస్ట్ మూవీ ఫలితాన్ని బేరీజు వేసుకుని, ఆపై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలనేది మేకర్స్ ఆలోచనట. మరి ఈ మూవీ పై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa