ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు "గాడ్ ఫాదర్" డిజిటల్ పార్ట్నర్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 03:57 PM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన "గాడ్ ఫాదర్" టీజర్ ప్రేక్షకాభిమానుల్లో ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ఫుల్ గ్రే రోల్ లో చిరును చూసిన ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. ఈ ఒక్క టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పరిచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని, సినిమా విడుదలైన తదుపరి ఈ ఓటిటిలోనే గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేసారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రను పోషించగా, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరీజగన్నాధ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa