అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన తేజ్ కూరపాటి నటిస్తున్న కొత్త చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా ..?'. ఈ చిత్రాన్ని వెంకట్ డైరెక్ట్ చేస్తుండగా, అఖిల ఆకర్షణ హీరోయిన్గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి "ఏకాంత సమయం" అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేసారు. కే. సందీప్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను రమ్య బెహరా ఆలపించారు. భవ్య దీప్తి రెడ్డి సాహిత్యం అందించారు.
GVR ఫిలిం మేకర్స్, రాజధాని ఆర్ట్ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై ముల్లేటి కమలాక్షి, GVR ఈ సినిమాను నిర్మించారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa