బాలీవుడ్ హీరోహీరోయిన్లు రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన తొలి చిత్రం "బ్రహ్మాస్త్రం". డైరెక్టర్ పదేళ్ల శ్రమ, ఐదేళ్ల నిరంతర షూటింగ్, భారీ బడ్జెట్, గ్రాండియర్ VFX ఎఫెక్ట్స్ ... బ్రహ్మాస్త్ర బ్యాక్ గ్రౌండ్ ఇది. పాన్ ఇండియా భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీన అంటే రేపు ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కింగ్ నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించారు.
సౌత్ లో ఈ సినిమా పట్ల చాలా మంచి అంచనాలు ఉన్నాయి. నార్త్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి కానీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈ సినిమా పట్ల తీవ్ర నెగిటివిటీని వ్యక్తం చేస్తున్నారు. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర పేరిట ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతటి విరుద్ధ వాతావరణంలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితం అందిస్తారో చూడాలి.