క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మూవీ మొగల్ డి రామానాయుడు మనవడు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ లోకి హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి "అహింస" అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె సినీప్రేమికులని ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో అభిరామ్ సరసన గీతిక అభిరామ్ జోడిగా నటించింది. ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందించారు.