కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని 125 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ అతి త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.
ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.