ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళకు వెళ్తున్న పొన్నియిన్ సెల్వన్ బృందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 03:48 PM

సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న పొన్నియిన్ సెల్వన్ లేటెస్ట్ గా కేరళలో ప్రమోషన్స్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు చిత్రబృందం మొత్తo కలిసి కేరళకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మణిరత్నం, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి కేరళకు వెళ్తూ ఫ్లైట్ లో దిగిన ఫోటో ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది.
తమిళ బాహుబలిగా రూపొందిన ఈ మూవీ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతుంది. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa