ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా పండుగన విడుదల కానున్న నాని "దసరా" ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 06:20 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'ధూమ్ ధామ్ ధోస్తాన్' అక్టోబర్ 5 దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక వీడియోని విడుదల చేసారు. ఈ వీడియోలో నాని 'మాసియెస్ట్ స్ట్రీట్ సాంగ్ ఎవర్' అని పాట గురించి ప్రకటన చేస్తున్నాడు.


యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa