కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ తో 'జాతిరత్నాలు' ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ చేస్తున్న చిత్రం "ప్రిన్స్". రీసెంట్గానే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడంతో, చిత్రబృందం సూపర్ ఫాస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
నిన్నే ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వగా, ఈ రోజు మేకర్స్ సినిమా నుండి న్యూ పోస్టర్ రిలీజ్ చేసి, దివాళికి రాబోతున్నాం అని అధికారికంగా తెలిపారు. అలానే ఇకపై ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయని తెలపకనే తెలిపారు.
ఈ సినిమాలో మారియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో విడుదలకు రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa