మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త చిత్రం "గాడ్ ఫాదర్" యొక్క హిందీ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. ఈ మేరకు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను, ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ హిందీ జనాలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, తమన్ సంగీతం అందించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎక్స్టెండెడ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుండగా, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa