నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK 2" సీజన్ త్వరలోనే ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీన ఈ ప్రోగ్రాం ట్రైలర్ విడుదల కాబోతుంది. పోతే, ఈ ప్రొమోషనల్ కంటెంట్ ను డైరెక్ట్ చేసేది ఎవరనుకుంటున్నారు?... టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతకుముందు NBK సీజన్ 1 కి కూడా ప్రశాంత్ వర్మే పని చేసారు. ఆ సీజన్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, తిరిగి ఆయననే సీజన్ 2 కోసం తీసుకోవడం జరిగింది.
ఈ మేరకు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. బాలకృష్ణ గారితో ఒకసారి పని చెయ్యడం కల నిజమవడమైతే, రెండో సారి కూడా ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం డెస్టినీ... సీజన్ 1 కి మించి అలరించే ప్రమోషనల్ కంటెంట్ రాబోతుందని పేర్కొంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు బాలయ్య గారితో వర్క్ చేస్తున్న ఒక వర్కింగ్ స్టిల్ ను జత చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa