బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న "కిసి కా భాయ్ కిసి కా జాన్" సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుండగా, లేటెస్ట్ గా ఆ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చింది.
గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు ముంబైలో జరిగింది. ఆ ఈవెంట్లో సల్మాన్ మాట్లాడుతూ... కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమాలో వెంకటేష్, రాంచరణ్ నటిస్తున్నారని చెప్పారు. వెంకటేష్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. అంతేకాక, చెర్రీ తనంతట తానే స్వయంగా అడిగి మరీ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారని సల్మాన్ చెప్పారు.
పోతే, ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఫర్హాద్ సంజి డైరెక్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa